శ్రీనివాస కళ్యాణం 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు సతీష్ వేగశ్న దర్శకత్వం వహించాడు. నితిన్, రాశీఖన్నా ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమకు మిక్కీ జె.మేయర్ సంగీతాన్నందించాడు.[3]
వాసు "నితిన్" ఉమ్మడి కుటుంబానికి చెందిన బాగా చదువుకున్న యువకుడు. అతను శ్రీ (రాశి ఖన్నా) తో ప్రేమలో పడతాడు. అతని ప్రేమ కోసం ఆమె తండ్రి "ప్రకాష్ రాజ్" తో ఎదుర్కొంటాడు. మరోవైపు, శ్రీ తండ్రి ధనవంతుడైన వ్యాపారవేత్త, వివాహం, సంప్రదాయాల యొక్క పాత విధానాలను లాంఛనప్రాయాలను నమ్మరు. మిగిలిన కథ ఏమిటంటే, వాసు తన ప్రేమను ఎలా గెలిపించుని, శ్రీ తండ్రి మనస్తత్వాన్ని మార్చడం ద్వారా తన వివాహాన్ని సాంప్రదాయక పద్ధతిలో జరిగేలా చేస్తాడు.