లిస్ట్ ఎ క్రికెట్లిస్ట్ ఎ క్రికెట్ అనేది క్రికెట్‌లో పరిమిత-ఓవర్ల (వన్-డే) రూపంలో జరిగే మ్యాచ్‌ల వర్గీకరణ. ఈ వర్గం లోకి వచ్చే గేమ్‌లు జరిగే వ్యవధి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. లిస్ట్ ఎ క్రికెట్‌లో వన్ డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్‌లు, వివిధ దేశీయ పోటీలూ ఉంటాయి, దీనిలో ఒక్కో జట్టు ఆడే ఇన్నింగ్స్‌లో ఓవర్ల సంఖ్య నలభై నుండి అరవై వరకు ఉంటుంది. అలాగే అధికారికంగా వన్‌డే హోదాను సాధించని దేశాలతో కూడిన కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఉంటాయి. ఫస్ట్-క్లాస్, ట్వంటీ 20 క్రికెట్‌తో పాటు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గుర్తింపు పొందిన మూడు ప్రధాన క్రికెట్ రూపాలలో లిస్ట్ ఎ ఒకటి. [1] 2021 నవంబరులో ICC, మహిళల క్రికెట్‌కు కూడా లిస్ట్ ఎ స్థితిని ఇచ్చి, గతంలో జరిగిన మ్యాచ్‌లకు కూడా వర్తింపజేసి, దానిని పురుషుల ఆటతో సమం చేసింది. [2] [3] స్థితిచాలా టెస్ట్ క్రికెట్ దేశాల్లో దేశీయ లిస్ట్ ఎ పోటీలు ఉన్నాయి. లిస్ట్ ఎ క్రికెట్‌లో ఓవర్ల సంఖ్య ఒక్కో జట్టుకూ నలభై నుండి అరవై ఓవర్ల వరకు ఉంటుంది, ఎక్కువగా యాభై ఓవర్లు ఉంటాయి. క్రికెట్ మ్యాచ్‌లను "లిస్ట్ ఎ"గా వర్గీకరించడాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2006 వరకు అధికారికంగా ఆమోదించలేదు.[4] ఈ వర్గీకరణను ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లకు నిర్ణయించిన విధంగానే నిర్ణయిస్తుంది. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌కు సమానమైన వర్గీకరణను వన్‌డే ఇంటర్నేషనల్ మ్యాచిలకు కూడా ఇవ్వడం కోసం, క్రికెట్ గణాంకవేత్తలు, చరిత్రకారుల సంఘం ఈ వర్గాన్ని సృష్టించింది. ప్రతి దేశంలో కొంత ముఖ్యమైన వన్డే పోటీలను, పర్యాటక టెస్టు జట్టుతో జరిగే మ్యాచ్‌లనూ మాత్రమే ఇందులో చేర్చారు. ఈ వర్గీకరణ చేసినది ఫిలిప్ బెయిలీ. మ్యాచ్‌లను మూడు విభాగాలుగా చేసారు:
లిస్ట్ ఎగా అర్హత పొందే మ్యాచ్‌లు
లిస్ట్ ఎగా అర్హత పొందని మ్యాచ్‌లు
మొదటి లిస్ట్ ఎ మ్యాచ్1963 మేలో జిల్లెట్ కప్ ప్రిలిమినరీ రౌండ్‌లో లాంకషైర్, లీసెస్టర్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌ని మొట్టమొదటి 'లిస్ట్ ఎ' గేమ్‌గా గుర్తించారు.[6] ప్రతి జట్టు 65 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయగా, ఒక్కొక్క బౌలరుకు 15 ఓవర్ల పరిమితి విధించారు.[7] ఇవి కూడా చూడండిమూలాలు
|