యూ టర్న్ (ఆంగ్లం: U TURN) తెలుగు - తమిళ ద్విభాషా మిస్టరీ - థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రం 2018 లో విడుదుల అయినది. ఈ చిత్రానికి పవన్ కుమార్ దర్శకుడు, రచయిత. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి, రాంబాబు బండారు బిఆర్ 8 క్రియేషన్స్, వివై కంబైన్స్, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ క్రింద నిర్మించారు. తమిళం, తెలుగు భాషలలో ఒకేసారి చిత్రీకరించబడినది. పవన్ కుమార్ స్వయంగా దర్శకత్వం వహించిన 2016 కన్నడ చిత్రానికి అదే పేరుతో రీమేక్ చేసారు.చెన్నైలోని ఒక ప్రత్యేక ఫ్లైఓవర్ (తెలుగు అనువాదంలో హైదరాబాద్ ) వద్ద ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించిన వాహనదారుల మరణం. తరువాత ఇంటర్న్ జర్నలిస్ట్, పోలీస్ ఇన్స్పెక్టర్ ద్వయం నేరస్థుడిని పట్టుకోవడం మీదనే ఈ చిత్రం ఉంటుంది.
ఈ చిత్రంలో సమంతా అక్కినేని, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమికా చావ్లా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం యొక్క ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ ఫిబ్రవరి 2018 న ప్రారంభమైంది, జూన్ మాసంలో ముగిసింది. యు టర్న్ చిత్రం లో పాటలు లేవు . ఇందులో పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించారు, అనిరుద్ రవిచందర్ ఒక ప్రత్యేకమైన పాటను పాడారు. నికేత్ బొమ్మిరెడ్డి, సురేష్ అరుముగం సినిమాటోగ్రఫీని సవరించారు.
గణేష్ చతుర్థి పండుగతో సమానంగా 13 సెప్టెంబర్ 2018 న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల స్పందన పొంది విజయవంతమైంది. ఈ చిత్రం 25 అక్టోబర్ 2018 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో VOD గా అందుబాటులోకి వచ్చింది..