అమర్ అక్బర్ ఆంటోని 2018 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. రవితేజ ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్ లో తొలిసారి త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు.[1][2][3][4] ఇలియానా తెలుగులో ఆరు సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో నటించింది.[5][6] మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
16 నవంబర్ 2018న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.[7][8][9] ఇది రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను తర్వాత వచ్చిన నాలుగవ చిత్రం.[10][11]
ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందించగా ఈ పాటలని లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.